సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం నచ్చక... ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్వాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నగేష్ ను అదే గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని విఠల్ కొడుకు పాండుతో కలిసి యువకుడి తండ్రి రాములుపై దాడి చేశాడు.