రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. శుక్రవారం ఉదయాన్నే లంక గ్రామాల్లో గొర్రెలను మేపుకొనేందుకు వెళ్లిన కాపరలు వరద నీరు చుట్టుముడుతుండటంతో ఆందోళనకు గురయ్యారు. లంకల్లో నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా భారీ వర్షం కారణంగా రాలేకపోయారు. తాజాగా కొంత మేర వర్షం తగ్గుముఖం పట్టినా, కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో బయటకు రాలేక గొర్రెల కాపరులు బిక్కుబిక్కుమంూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయకచర్యలు ముమ్మరం చేసింది.