బిహార్‌లో బంద్ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపించింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పిల్లలతో వెళ్తున్న పాఠశాల బస్సును భారత్ బంద్ నిరసనకారులు అడ్డుకున్నారు. బస్సు వెళ్లకుండా రోడ్డుపై బస్సును నిలిపి వేయడంతో.. కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉంది. అయితే కొందరు నిరసనకారులు బస్సు కింద ఉన్న టైర్లకు నిప్పంటించారు. దీంతో బస్సు కింద మంటలు చెలరేగాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న బస్సులోని పిల్లలకు ఊహించని ప్రమాదం జరిగేది. సకాలంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.