అది రద్దీగా ఉన్న ఓ బజారు. నిత్యం స్థానికులు పలు పనుల నిమిత్తం అటుగా వెళ్తుంటారు. అయితే ఆ వీధిలో ఉన్న ఓ ఇంటి 5వ అంతస్తు నుంచి హఠాత్తుగా ఏదో రోడ్డుపై పడింది. కానీ సరిగ్గా అదే సమయానికి రోడ్డుపై ఓ తల్లీకూతురు నడుచుకుంటూ వెళ్తున్నారు. భవనం నుంచి బయటపడిన అది నేరుగా చిన్నారిపై పడటంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అసలు అంత ఎత్తు నుంచి కింద పడింది ఏంటా అని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. అది ఆ భవనంలో పెంచుకుంటున్న పెంపుడు కుక్క. అంత ఎత్తునుంచి కింద పడ్డా దానికి ఒక్క దెబ్బ కూడా తగలేదు. కాసేపు అలాగే పడ్డచోట కూర్చుని.. ఆ తర్వాత తోకూపుకుంటూ వెళ్లిపోయింది.