బిరబిరా కృష్ణమ్మ ప్రవాహం.. దీపాల కాంతిలో అద్భుత దృశ్యం.. పోటెత్తుతున్న ప్రజలు

దీపాల కాంతిలో జల దృశ్యం.. జనం తన్మయత్వం. చుట్టూ చీకటి...లైట్ల వెలుగులో మెరిసిపోతున్న ప్రకాశం బ్యారేజ్‌. బిరబిరా గేట్లు దూకుతున్న కృష్ణమ్మ ప్రవాహం. వారెవ్వా ఏమి దృశ్యం...ఈ జల దృశ్యం అంటున్నారు బెజవాడ జనం. సెలవులు కావడంతో ఈ జల దృశ్యాన్ని చూడడానికి భారీ ఎత్తున బెజవాడ వాసులు బ్యారేజీని సందర్శిస్తున్నారు.