నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఏపీకి భారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతరామరాజు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.