మా ఊరి బిడ్డ సీఎం అయ్యిండంటూ కొండారెడ్డి పల్లె ఖుషీ ఖుషీగా సంబురాలు చేసుకుంటోంది. మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందంటూ గ్రామస్తులంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొండారెడ్డి పల్లెకు వెళ్లిన టీవీ9తో.. రేవంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉప్పొంగిపోయారు. తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని అధికారికంగా ప్రకటించటంతో.. కొండారెడ్డిపల్లి గ్రామస్తులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు.