సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తాను పూజించే దేవుళ్ల గదిలో పెట్టుకుంది కుమారి ఆంటీ. సీఎం రేవంత్‌కు నిత్యం పూజలు చేయడం హాట్ టాపిక్ అయింది. తన ఫుడ్ స్టాల్ ఈరోజు ఉందంటే, తక్కువ ధరలో మంచిగా కడుపు నిండా అన్నం పెడుతున్నానంటే.. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని కుమారి అంటీ చెబుతున్నారు. అందుకు తనకు ఆయన దైవంలాంటి వారని వెల్లడించారు. ప్రతిరోజు తన దేవుళ్లతో పాటు, రేవంత్ ఫోటోకు కూడా దండం పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తానని కుమారీ ఆంటీ చెప్పడం విశేషం..!