నిందితుడిని పట్టుకునేందుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులు ఏం చేశారో చూడండి

రాజస్థాన్ రాష్ట్రంలోని సీకర్ జిల్లా ధోద్ ప్రాంతంలో అత్యాచార ఆరోపణలతో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి వచ్చిన మౌలాసర్ పోలీసు కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. నిందితుడు గౌతమ్ ఇంటికి వెళ్లి పోలీసులు అతన్ని పట్టుకునే సమయంలో, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పోలీసులపైనే దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలో ఆ మహిళలు పోలీసుల జుట్టు లాగడం, చెంపదెబ్బలు కొట్టడం వంటి దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.