గోడౌన్‌లో కూలీలపై అకస్మాత్తుగా కూలిన బస్తాలు.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..

గుజరాత్‌లోని అమ్రేలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక గోడౌన్‌లో కొందరు కూలీలు గోధుమల బస్తాలను అన్‌లోడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా కూలీలపై బస్తాలు దొర్లిపడ్డాయి. బస్తాలు కూలిపోవడంతో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్తాల కింద చిక్కున్న కూలీలను తోటి కూలీలు వెలికి తీశారు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.