శ్రీశైలం డ్యాంకి భారీగా వరద నీరు.. రేపు పూజ చేసి గేట్లు ఎత్తనున్న మంత్రి నిమ్మల

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా ప్రస్తుతం 876.70 అడుగులుగా ఉంది. అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 కాగా ప్రస్తుతం 171.8625 గా ఉంది. మరోపక్క ఇప్పటికే కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు 62,857 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి ఉపయోగిస్తూ.. దిగువకు నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు.