తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారిపాదాలు, శిలాతోరణం దగ్గర మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన టీటీడీ అధికారులు, ఫైర్ సిబ్బంది.. రెండు ఫైరింజన్లతో కష్టం మీద మంటలు అదుపు చేశారు. హటాత్తుగా జరిగిన ఈ అగ్నిప్రమాదంతో శ్రీవారి భక్తులు ఉల్కిపడ్డారు. శ్రీవారిపాదాలు, శిలాతోరణం ప్రాంతాల్లోని పచ్చని అడవి అగ్నికి ఆహుతైంది.