ఘోరం.. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

హైదరాబాద్‌లో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఈ ఘటనపై బాచుపల్లి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారుల అంచనాకు వచ్చారు.