రెక్కాడితేగానీ డొక్కాడని పేద బ్రతుకులు వారివి. ఎండెనక, వానెనక.. పగలు, రాత్రి తేడాలేకుండా కష్టించి పనిచేసుకుని జీవనం సాగించే అభాగ్యుల బతుకులంటే కొందరు మదమెక్కిన ధనవంతులకు పరిహాస్యం. తాజాగా ఓ రోడ్డు పక్కన చీపురుతో ఊడ్చుతున్న కార్మికురాలిని కారులో వెళ్తున్న ఓ బడా బాబు తన వాహనంతో నిర్ధాక్షిణ్యంగా ఢీ కొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన ఆ అభాగ్యురాలు ఆర్తానాదాలు చేస్తూ విలపించింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని హన్మకొండలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.