సాధారణంగా పాముకు ఆకలి వేస్తే కోడి పిల్లలను,గుడ్లను,కప్పలను, ఎలుకలను మింగేయటం చూసే ఉంటాం. కానీ ఓ భారీ నాగు పాముకి ఎంత ఆకలి వేసిందో ఏమోగానీ తోటి భారీ నాగు పామును గుటకలేస్తూ కసిగా మింగేసింది. అది కూడా జనావాసాల మద్య అందరూ చూస్తుండగానే అమాంతంగా మింగేసిoది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో చోటుచేసుకుంది.