తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో గురువారం సచివాయలంలోని ఫారెస్టు మినిస్టర్ ఛాంబర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా చూపిన చొరవను, కమిషనర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్దరించినందుకు శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, తన పరిధిలో ఉన్న ఎండోమెంటు శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ స్పందింస్తూ.. సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖకు వివరణ ఇచ్చారు.