ఏమో.. గుర్రం గాల్లో ఎగరావచ్చు.. అధిష్టానం మనసు మారావచ్చు.. అంటూ అట్నుంచి నరుక్కొస్తున్నారు కొందరు వైసీపీ సిట్టింగులు. మార్పులు-చేర్పుల పర్యవసానాల్లో భాగంగా.. కొన్నిచోట్ల.. సైలెంట్‌గా రెబల్ సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా రెండునెలలుంది.. ఇంకాస్త కష్టపడితే హైకమాండ్ మనసులో స్థానం సంపాదించలేమా.. బీఫారమ్ తెప్పించుకోలేమా.. ఇదీ వీళ్లకుండే చివరాఖరి దింపుడు కళ్లెం ఆశ.