క్లాస్‌రూమ్‌లో కనిపించింది చూసి విద్యార్థుల షాక్..!

అరచేతిలో టెక్నాలజీ, ఇంటర్నెట్‌తో ప్రపంచాన్నే దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తోంది. పాఠశాల ప్రాంగణంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. శనివారం (అక్టోబర్ 4) ఉదయం జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపులో DSP కార్యాలయంకు కూతవేటు దూరంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన.