లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది సీబీఐ. కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో జైల్లోనే కవిత విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు.