మంటల్లో రైలు బోగి దగ్దం.. రెప్పపాటులో తప్పిన భారీ ప్రమాదం..!

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి ఉన్న ఒక రైలు భోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగి పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగులు పెట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే పార్కింగ్ చేసి ఉన్న బోగిలో మంటలు ఎలా చేరగాయి..! ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా..? లేక షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పాట్‌కు చేరుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.