ఇదే నా అడ్డా..! ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.. ఇక్కడే ఉంటాః రోజా ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తున్నా, ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేకించి నగరిలో ఆమెకు అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగిరి లోనే ఉంటానంటోంది. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడే ఉంటా ఎక్కడికీ వెళ్ళనని చెబుతోంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందేటంతటి తప్పులు చేయలేదని చెబుతోంది రోజా.