నాగోబా వేడుకలో ప్రతీ ఘట్టం ఎంతో అద్వితీయం

పుష్యమాస అమవాస్య ..అర్ధరాత్రి వేళ నాగోబా ఆలయంలో ఆనవాయితీ ప్రకారం భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు మెస్రం వంశ పూజారులు. ఏడు కావిడిలతో నెయ్యి, పుట్ట తేనే , బెల్లం , గానుగ నూనే.. 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాద్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లరా చూసి తన్మయత్వం చెందారు.