శవాన్ని భజాన వేసుకున్న తండ్రి.. 8 కిలోమీటర్ల ప్రయాణం.. ఎందుకంటే..

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామమైన చిన్న కోనల గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా కొల్లూరు ఏరియా ఇటుక బట్టి పనులకు వెళ్లారు ఆదివాసీ గిరిజన దంపతులు సారా కొత్తయ్య, భార్య సార సీత. ఈ క్రమంలోనే అంతులేని విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన.