భారీ వర్షాల కారణంగా నార్త్ సిక్కింలో 1500 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. భారీ వరదలకు రహదారులపై కొండ చరియలు విరిగిపడటంతో ప్రయాణాలు నిలిచిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. లాచుంగ్ ప్రాంతంలో 1350 మంది, లాచెన్‌లో 115 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గే వరకూ పర్యటకులు ఈ ప్రాంతాలకు రాకూడదని సూచించారు.