టీజీపీఎస్‌సీ కార్యాలయం దగ్గర నిరుద్యోగుల నిరసన మిన్నంటింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతుగా అక్కడికి వచ్చిన బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం తగదని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్‌సీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషను పోలీసులు, అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.