నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో దరిద్ర దేవత (జెట్టక్క) ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన ఆచారాన్ని గ్రామస్తులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాత చీపుర్లు, చాటలతో ఊరంతా ఊరేగుతూ, దరిద్రం దూరమై సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు. ఈ వింత సంప్రదాయం ద్వారా వ్యక్తిగత, గ్రామీణ సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం.