ఓ ఎమ్మెల్సీ వివాహం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వివాహం సాధారణంగా జరిగే విషయమే కదా ఎందుకు హాట్ టాపిక్ అయిందని అనుకుంటున్నారా.. అయితే ఆ ఎమ్మెల్సీ చేసుకున్నది మూడో వివాహం కావడం ఇందుకు ఒక కారణం అయితే మరో కారణం ఆయన నుంచి చట్టబద్ధం గా విడిపోయిన రెండో భార్య ఆ వివాహానికి సాక్షిగా సంతకం చేయడం.