బాబ్రీ మసీదు నగదు వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బాబ్రీ మసీదుకు శంకుస్థాపన కార్యక్రమం నిన్న ప్రారంభమైందని.. బాబ్రీ మసీదు నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమం డిసెంబర్ 6, 2025న ప్రారంభమైందని.. ఆ రోజు బాబ్రీ మసీదుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.