శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి దొర్లింది. గ్రామంలో మంగళవారం గ్రామ దేవత శ్రీ అసిరితల్లి, శ్రీబంగారమ్మ తల్లి సిరిమాను ఊరేగింపు జరుగుతుండగా సిరిమాను ఒక్కసారిగా విరిగిపోయింది. సిరిమాను చిట్టచివర కూర్చున్న పూజారి దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డారు. దీంతో కిందనున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను బుడగట్లపాలేం గ్రామానికి చెందిన సూరాడ అప్పన్న (47), కారి పల్లేటి (50) గా గుర్తించారు పోలీసులు