ఈ ఘటన తన దృష్టికి రావడంతో ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. వికసిత్ భారత్' కోసం కృషి చేసేలా నారీ శక్తి' ఆశీర్వాదం తనకు స్ఫూర్తినిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఆప్యాయత తనను కదిలిస్తోందనీ తనను ఆశీర్వదిస్తున్న నారీ శక్తికి నమస్కరిస్తున్నాననీ అన్నారు. వారి ఆశీస్సులు వికసిత్ భారత్ నిర్మాణం దిశగా నిరంతరం కృషి చేసేందుకు తనను ప్రోత్సహిస్తాయి అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.