హోళీ అంటే అక్కడ‌ గుద్దుకోవ‌డ‌మే..! - TV9

గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న హనుమాన్‌ మందిరం పిడిగుద్దులాటకు వేదికగా మారింది. గ్రామ పెద్దలు ఐక్యతతో ఈ వేడుక నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామ పెద్దలను డప్పు వాయిద్యాలతో చావిడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడే రెండు వైపులా బలమైన కట్టెలు పాతి వాటి మధ్య తాడు కట్టారు..తర్వాత గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఇలా 15 నుంచి 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగింది. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు