ముద్రగడను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన రంగంలోకి దిగడం గోదావరి జిల్లాల్లో సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపింది. ముద్రగడ జనసేనలో చేరితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమికి తిరుగుండదనే నమ్మకంతో ఉన్నారు ఇరు పార్టీల నేతలు. ఈ క్రమంలో పలువురు జనసేన నేతలు ఆయనతో కలిసి చర్చలు జరిపారు.