Praneeth Rao Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ - TV9

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ప్రణీత్ రావు అండ్ టీమ్ ఓ ఆఫీస్‌ని ఏర్పాటు చేసుకున్నట్టు విచారణలో తేలింది.