ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఎందుకు ఎడారిని తలపిస్తుంది.?

తెలంగాణ రాష్ట్ర పర్యాటక ముఖచిత్రానికి కంఠాభరణం ఈ లక్నవరం. చుట్టూ కొండలు, ఆ కొండలకు ఆకుపచ్చ రంగేసినట్లు పరుచుకున్న పచ్చదనం. ఎలాంటి వారికైనా సరే ఈ ప్రకృతి అందాలను చూస్తే మనసు పులకరించిపోతుంది. లక్నవరం సరస్సులో నీళ్లపై వేలాడే సస్పెన్షన్ బ్రిడ్జిపై గడిపితే ఏదో తెలియని ఆనందం మనలో ఉప్పొంగి పోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు సైతం లక్నవరం సందర్శనకు వస్తుంటారు. ఈ ప్రకృతి అందాల మధ్య తనివితీరా ఎంజాయ్ చేసి ఆనందంతో మురిసిపోతుంటారు. కానీ ఇప్పుడు లక్నవరం ఓ ఎడారిని తలపిస్తుంది. ఈ ఏడాది ఎండలు అంత పెద్ద ప్రభావం చూపకపోయిన లక్నవరం సరస్సులోని నీరంతా అడుగంటి పోయింది. జలకళతో ఉట్టిపడే ఈ సరస్సు ఇప్పుడిలా పూర్తి నిర్మానుష్యంగా మారింది..