ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం దగ్గర ఓ లారీ-ప్రైవేటు బస్సు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన బస్సు.. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తోంది.