ఒకే కుటుంబం నుంచి 3 పార్టీల్లోకి.. ఈ జిల్లాలో పీక్స్‎కు చేరిన పొలిటికల్ డ్రామా..

ఒకే కుటుంబం నుంచి 3 పార్టీల్లోకి.. ఈ జిల్లాలో పీక్స్‎కు చేరిన పొలిటికల్ డ్రామా.. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు అదే ఫ్యామిలీలో మూడు ముక్కలాట నడుస్తోంది. కొడుకు వైసీపీతో, కూతురు టీడీపీతో, ఇక మనవరాలికి జనసేనతో దోస్తీ ఏర్పడింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పార్టీతో అంటకాగడంతో అనుచరుల్లో అయోమయం ఏర్పడింది. రాజకీయాల్లో కీలక నేతగా రాణించిన ఆ పెద్దాయన ఫ్యామిలీలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా జిల్లాలో ఇప్పుడు చర్చగా మారింది. డీకే ఆదికేశవులు. పారిశ్రామిక వేత్తగా, చిత్తూరు ఎంపీగా, టీటీడీ చైర్మన్‎గా పనిచేసిన రాజకీయ అనుభవం ఆయనది. అంతేకాదు ఏఐసీసీ కోశాధికారిగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేకం.