హైదరాబాద్ రాంనగర్ టీఆర్టీ కాలనీలో అమర్నాథ్ మంచులింగం సెట్టింగ్ తో భారీ వినాయక మండపం నిర్మించారు. మంచులింగంతో పాటు 12 జ్యోతిర్లింగాలతో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మంచులింగం, జ్యోతిర్లింగాలను చూడటానికి తండోపతండాలుగా భక్తులు రావడంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికశోభసంతరించుకుంది.