సోషల్ మీడియాలో చాలా జరుగుతుంటాయి. అన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ నేతలు ప్రశ్నించుకోవడం.. దానికి సమాధానం ఇవ్వడం కూడా అప్పుడప్పుడు ఆసక్తిని రేపుతుంటాయి. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పేరిట ఓ సంస్థ కథనాన్ని ప్రచురిస్తే.. ఇది నిజమేనా అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారు.