వింత వర్షం.. దేవుడిచ్చిన వరమా..? శాపమా..? హైదరాబాద్ పాతబస్తీలోని మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ లైన్ ఏరియాలో వింత వర్షం కురిసింది. స్థానిక కాలనీలోని ఒక చిన్న గల్లీలో ఒకే దగ్గర వర్షం పడింది. మళ్లీ ఆ వర్షం ఇటు పక్క, అటు పక్క గానీ పడలేదు. జనాలు ఈ వింత వానని చూస్తూ అలాగే రోడ్డుపై నిలబడిపోయారు. ఒక ఇంటి ముందు కురుస్తున్న వర్షం మళ్లీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఒక్కోసారి వాతావరణంలో జరిగే మార్పుల వల్లే ఇలా అవుతుందని నిపుణులు అంటుంటే.. మరికొందరు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, అందుకే ఇలా అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆ కాలనీ ప్రజలకు ఇది చాలా వింతగా తోచింది. దీనిపై అక్కడివారికి అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.