ఏకంగా పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం మొక్కులు

ఏకంగా పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం మొక్కులు తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమ గా చూసుకున్నారు. ఆ శునకం కూడా వారి కుటుంబంలో ఒక మెంబర్‌లా కలిసి పోయింది. ఒక్కసారిగా ఆ పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యం బారిన పడింది. చనిపోతుందనే భయపడ్డారు. ఏమి జరుగుతుందో అనే ఆందోళన చెందారు. కానీ వారి మొక్కులు ఫలించాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో తన పెంపుడు కుక్కకు నిలువెత్తున బంగారం (బెల్లం)సమర్పించి మొక్కు తీర్చుకున్నారు భక్తురాలు స్వప్న, నగేష్ దంపతులు.