పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా టీ.కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ కనీసం 14 స్థానాల్లోనైనా జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. తాజాగా.. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది అధిష్టానం. అటు.. పెండింగ్‌లోనున్న నాలుగు ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.