తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలో తల్లుల్లో ఆనందాన్ని నింపింది ఏపీ సర్కార్. అర్హులందరికీ సూపర్ సిక్స్ లోని తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులకు ఒక్కొక్కరికి రూ 13 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పిన మాట మేరకే నగదు జమ చేసింది.