అనంతపురం జిల్లా కసాపురంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా.. మూడో రోజు డ్రైఫ్రూట్స్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నెట్టికంటి ఆంజనేయుడు. తొలిరోజు పుష్పాలంకరణ, రెండో రోజు గంధాలంకరణ, మూడో రోజు డ్రైఫ్రూట్స్ అలంకరణ, నాలుగో రోజు వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, ఐదో రోజు స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.