ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ పర్యటించారు. మంగాపురం రోడ్డులో పొలాల్లో కలియతిరుగుతూ.. జరుగుతున్న వరి పంట కోతలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరి కోతల మిషన్‌పై కలెక్టర్ కూర్చొని వరి కోత కోయించారు. ధాన్యం పంట విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నాయా, రైస్ మిల్లర్ల దగ్గర ఏదైనా కోతలు జరుగుతున్నాయా, అధికారుల స్పందన వంటి వివరాలను తెలుసుకున్నారు.