నెల్లూరు హైవేపై ఘోర ప్రమాదం.. బైకర్ చేసిన ఆ తప్పుడు పనికి 3 ప్రాణాలు బలి!

ద్విచక్ర వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయి. జాతీయ రహదారులపై సడన్ గా రోడ్ క్రాస్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. వారితో పాటు జాగ్రతగా డ్రైవింగ్ చేస్తున్న వారి ప్రాణాలు గాలిలొ కలుస్తున్నాయి. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కూడా ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యమే కారణమని తేలింది. రహదారుల వెంబడి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ.. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి కొన్నిసార్లు మానవ తప్పిదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం కూడా అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. సూళ్లూరుపేటలో చేపలను అన్లోడ్ చేసుకున్న కంటైనర్ లారీ నెల్లూరుకు బయల్దేరింది. ఎన్టీఆర్ నగర్ సమీపానికి రాగానే.. పద్మావతి గ్రీన్ సిటీ నుంచి ఓ బైక్ సడన్ గా కావలి వైపు యూటర్న్ తీసుకుంది. మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్ డ్రైవర్.. బైక్ను తప్పించబోయి వేగాన్ని నియంత్రించలేకపోయాడు.