చిత్తూరు జిల్లా అడవుల్లో చిరుత పులుల మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం రెండు చోట్ల చిరుతలు మృతి కలకలం రేపుతోంది. యాదమరి, సోమల అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల కళేబరాలను గుర్తించిన అటవీశాఖ హడలిపోతోంది. మృతి చెందిన చిరుతపులుల కాళ్లను నరికి, కోరలను మాయం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వేటగాళ్ల ఉచ్చుకు చిరుతలు బలవుతున్నాయా...? లేదంటే ప్రమాదాలకు గురై మరణిస్తున్నాయా..? అన్న దానిపై స్పష్టత లేకపోగా చిరుతల మరణాల వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది.. !