దెబ్బకు దెబ్బ.. పహల్గాం మారణకాండ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు ఢాం..!

జమ్ముకశ్మీర్‌లోని బందీపురా జిల్లాలో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. కుల్నార్‌ బాజీపురాలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్‌లోని మోంఘమా ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఇంటిని సైన్యం గుర్తించింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇంటిని బలగాలు పేల్చేశాయి. ఆ ఇల్లు ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌ లోయలో పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకలో ఆసిఫ్ షేక్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతడి కోసం ముమ్మర దర్యాప్తు జరుగుతుంది. సమాచారం ప్రకారం లష్కరే తోయిబా (LeT) స్థానిక కమాండర్‌గా ఆసిఫ్ షేక్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.