అనుబంధాలు పతమనమవుతున్న ఈ రోజుల్లో ఓ భర్త మృతిచెందిన తన భార్యకు విగ్రహం కట్టించాడు. ఆమెకు గుడిలాంటి అందమైన సమాధిని నిర్మించి అందులో విగ్రహం ఏర్పాటు చేశాడు. భార్యలేని ఎడబాటును జీర్ణించుకోలేక భార్య విగ్రహం పక్కనే బతికుండానే తన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు. వీరి ఇద్దరి విగ్రహాలు చూడగానే మనసులో వారి అన్యోన్య దాంపత్యం, మాధుర్యం తెలిపిసిపోతుంది. కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్‌లో ఇనాయత్ నగర్ వెళ్లే దారిలో రోడ్డు సమీపంలో సమాదిపై తన భార్య దివంగత పడాల చంద్రబాగు విగ్రహం పక్కనే బతికున్న తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పడాల గంగాధర్.