వర్షంలో రోడ్డుమీద వయ్యారంగా పాకుతూ వలస వెళ్తున్న చేపలు..

ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామ చెరువులకు పండుగ వాతావరణం నెలకొంది. కారణం ఏమిటంటే చుట్టుపక్కల చేల నుంచి చిన్న చిన్న గుంతల నుంచి భారీ సంఖ్యలో చేపలు చెరువుల్లోకి వలస వస్తున్నాయి. రోడ్డు మీద వయ్యారంగా పాకుతూ ఒక దానివెనుక క్యూ కట్టిన చేపల వలసకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.