పగలు రాజకీయ నాయకుడు.. రాత్రయితే క్షుద్రపూజలు..

మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.